ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

47
HYD-Collector1

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ విజయ దశమి (దసరా) అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మణ్ అన్నారు. జిల్లా ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..