- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో హవాలా డబ్బు సీజ్
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం చేపట్టిన రెండు వేర్వేరు దాడులలో ఎలాంటి ఆధారం లేని రూ.34 లక్షలను పట్టుకున్నారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సయ్యద్ అహ్మద్ రూ.21 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులకు సరైన ఆధారాలను చూపించకపోవడంతో అతనిని అరెస్టు చేసి, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ పరిధిలో […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం చేపట్టిన రెండు వేర్వేరు దాడులలో ఎలాంటి ఆధారం లేని రూ.34 లక్షలను పట్టుకున్నారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సయ్యద్ అహ్మద్ రూ.21 లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులకు సరైన ఆధారాలను చూపించకపోవడంతో అతనిని అరెస్టు చేసి, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్ పరిధిలో కూడా రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.13 లక్షలు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించినట్టు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు తెలిపారు.
Next Story






