నేను చేసిన సేవకు ఫలితం ఇదా..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-23 12:07:11  IST  )

<p>దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ మానవ సంబంధాలను మరింత దిగజారుస్తోంది. కరోనా వైరస్ ప్రజల్లో ఏ స్థాయిలో భయాందోళనలు కల్పిస్తోందో తెలిపే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం భర్తకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో ఆయనను క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. ఆమె భర్త ద్వారా ఆమెకు కరోనా సోకి ఉంటుందని, ఆమెతో మాట్లాడితే అది తమకు కూడా సోకుతుందని ఆందోళన చెంది, ఆమెను [&hellip;]</p>

నేను చేసిన సేవకు ఫలితం ఇదా..
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ మానవ సంబంధాలను మరింత దిగజారుస్తోంది. కరోనా వైరస్ ప్రజల్లో ఏ స్థాయిలో భయాందోళనలు కల్పిస్తోందో తెలిపే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం భర్తకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో ఆయనను క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. ఆమె భర్త ద్వారా ఆమెకు కరోనా సోకి ఉంటుందని, ఆమెతో మాట్లాడితే అది తమకు కూడా సోకుతుందని ఆందోళన చెంది, ఆమెను ఇంటికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. తనకు కరోనా సోకలేదని ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. దీంతో ఆవేదనకు గురైన సదరు ఏఎన్ఎం ఇన్నేళ్ల సేవకు దక్కిన ఫలితం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story