- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పుడు వద్దు.. రేపు రా అన్నందుకు భర్త ఆత్మహత్య
<p>దిశ, పరిగి : తన వద్దకు వస్తానని భర్త ఫోన్ చేయగా.. ఇప్పుడు వద్దు, రేపు ఉదయమే రావాలని చెప్పడంతో మద్యం మత్తులో మనస్తాపం చెంది భర్త పురుగుల మందు తాగాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విఠల్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పుట్టాపహాడ్‌కు చెందిన మహబూబ్ మియా, మునిరాభేగం భార్య భర్తలు. మహబూబ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, మునిరాబేగం పుట్టాపహాడ్ నుంచి తన తల్లిగారి ఇంటికి […]</p>

దిశ, పరిగి : తన వద్దకు వస్తానని భర్త ఫోన్ చేయగా.. ఇప్పుడు వద్దు, రేపు ఉదయమే రావాలని చెప్పడంతో మద్యం మత్తులో మనస్తాపం చెంది భర్త పురుగుల మందు తాగాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విఠల్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పుట్టాపహాడ్‌కు చెందిన మహబూబ్ మియా, మునిరాభేగం భార్య భర్తలు. మహబూబ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
అయితే, మునిరాబేగం పుట్టాపహాడ్ నుంచి తన తల్లిగారి ఇంటికి సోమవారం వెళ్లింది. అదే రోజు సాయంత్రం మహబూబ్ మియా భార్య వద్దకు వస్తానని ఫోన్ చేశాడు. మద్యం తాగి ఉన్నావు, ఇప్పుడు వద్దు.. ఉదయాన్నే రావాలని భార్య మునిరాబేగం భర్తకు చెప్పింది. దీంతో మద్యం మత్తులో ఉన్న మహబూబ్ మియా మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






