- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య కాపురానికి రావడంలేదని.. షాకింగ్ డెసిషన్
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తగూడ ఎస్ఐ సురేష్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు శ్రీకాంత్(26)కు ఇటీవల వివాహం జరిగింది. గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి, ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదు. దీంతో భార్య కాపురానికి రావడంలేదని తీవ్రమనస్థాపం చెందిన శ్రీకాంత్ గ్రామశివారులో పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. […]</p>

X
దిశ, మహబూబాబాద్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తగూడ ఎస్ఐ సురేష్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు శ్రీకాంత్(26)కు ఇటీవల వివాహం జరిగింది. గతకొంతకాలంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి, ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగిరావడం లేదు. దీంతో భార్య కాపురానికి రావడంలేదని తీవ్రమనస్థాపం చెందిన శ్రీకాంత్ గ్రామశివారులో పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలిసిన బంధువులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






