- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య రెండు చేతులు నరికి.. కరోనానే కారణమన్న భర్త
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. బంధాలను, బంధుత్వాలను విచ్చినం చేస్తోంది. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తల్లీబిడ్డలను కూడా వేరుచేసి విలయతాండవం సృష్టిస్తుంది. కరోనా కారణంగా ఎంతోమంది తమ అనుకున్నవాళ్లను పోగొట్టుకున్నారు. మరెంతోమంది తమ అనుకున్నవారినే రోడ్ల మీద వదిలిస్తున్నారు. ఇంకొంతమంది కరోనా భయంతో ఆత్మహత్యచేసుకున్నారు.. కానీ ఒక భర్త తన భార్యకు కరోనా వచ్చిందని అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం..కావలికి చెందిన ఓ వ్యక్తి భార్యకి ఇటీవలే కరోనా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. బంధాలను, బంధుత్వాలను విచ్చినం చేస్తోంది. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తల్లీబిడ్డలను కూడా వేరుచేసి విలయతాండవం సృష్టిస్తుంది. కరోనా కారణంగా ఎంతోమంది తమ అనుకున్నవాళ్లను పోగొట్టుకున్నారు. మరెంతోమంది తమ అనుకున్నవారినే రోడ్ల మీద వదిలిస్తున్నారు. ఇంకొంతమంది కరోనా భయంతో ఆత్మహత్యచేసుకున్నారు.. కానీ ఒక భర్త తన భార్యకు కరోనా వచ్చిందని అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం..కావలికి చెందిన ఓ వ్యక్తి భార్యకి ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీంతో భర్త ఆందోళన చెందాడు. భార్యవలన తనకు కరోనా సోకుతుందేమో అని భయపడి.. ఆమెను కిరాతకంగా హత్యచేశాడు. భార్య రెండు చేతులు నరికి, హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






