- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితకు ఫోన్ కాల్స్.. చితకబాది ట్రాన్స్ ఫార్మర్‌పైకి తోసేసిన భార్యాభర్తలు!
<p>దిశ, వెబ్‌డెస్క్ : పెండ్లయిన మహిళకు గుర్తుతెలియని ఓ యువకుడు తరుచుగా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేస్తుండేవాడు. పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వివాహిత తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని ఆచూకీ కనుగొన్న భార్యాభర్తలు ఇద్దరూ ఆ యువకుడిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే అతన్ని చితకబాది ట్రాన్స్‌ఫార్మర్ పైకి తోసేసారు. కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : పెండ్లయిన మహిళకు గుర్తుతెలియని ఓ యువకుడు తరుచుగా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేస్తుండేవాడు. పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వివాహిత తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని ఆచూకీ కనుగొన్న భార్యాభర్తలు ఇద్దరూ ఆ యువకుడిపై దాడికి దిగారు.
ఈ క్రమంలోనే అతన్ని చితకబాది ట్రాన్స్‌ఫార్మర్ పైకి తోసేసారు. కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని లింగంపల్లిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






