- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీ బంగారం పట్టివేత
<p>దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. దేశమంతా కొవిడ్ మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే వారు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ పనిచేసుకుంటూ పోతున్నారు. అందుకోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ వాహనంలో రూ.1.08 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిలో 818 గ్రాముల బంగారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. దేశమంతా కొవిడ్ మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతుంటే వారు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ పనిచేసుకుంటూ పోతున్నారు. అందుకోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ వాహనంలో రూ.1.08 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిలో 818 గ్రాముల బంగారం వస్తువులను గుర్తించి వివరాలు అడగ్గా, వారు నుంచి ఏ సరైన పేపర్లు, సమాధానం లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలుకు బంగారాన్ని తరలిస్తున్నట్లు తేలింది.
Next Story






