మీకు ఎక్కువ కాలం జీవించాలని ఉందా..? అయితే ఇవి తినండి

by  |
Pandlu-34
X

దిశ, అమనగల్లు: ప్రతి ఏటా వర్షాకాలంలో చెరువులు, గుట్టల ప్రాంతాల్లో ఉచితంగా లభించే ఏకైక ఫలం సీతాఫలం. పేదోడి ఆపిల్ గా పిలువబడే సీతాఫలం మాట వింటేనే నోరూరుతుందని, పండులో తియ్యదనంతో పాటు పోషకాలు విరివిగా ఉండడంతో ప్రతి సీజన్ లో ప్రతి ఒక్కరూ సీతాఫలాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి తింటే మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాక దీర్ఘకాలిక రోగాలను అదుపు చేసే శక్తి సైతం కలుగుతదని వారు పేర్కొన్నారు. అతితక్కువ ధరకు లభించే సీతాఫలాలకు ఈ సీజన్ లో వర్షాలు సమృద్ధిగా పండడంతో ఫలాల దిగుమతి పెరిగింది.

Pandlu-1

ప్రస్తుత సమయంలో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రెక్కల కష్టంపై ఆధారపడి జీవించే కూలీలకు సీతాఫలాల సేకరణ ఉపాధిగా మారింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ అటవీ భూములు ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా గిరిజనులు సీతాఫలాల సేకరణ చేపట్టి ఉపాధి పొందుతున్నారు. సేకరించిన సీతాఫలాలను అమనగల్లు నుంచి కడ్తాల వరకు జాతీయ రహదారిపై బుట్టలో పెట్టి విక్రయాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రహదారిపై బుట్టలో అలంకరించి పెట్టిన సీతాఫలాలను చూస్తే చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుపై శ్రీశైలం వెళ్లే వాహనదారులు వాటిని కొనుగోలు చేసి తీసుకువెళ్తుండడంతో కూలీలకు ఆసరాగా మారింది.

Pandlu-2



Next Story