- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికుడికి చేదు అనుభవం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భారీ ఫైన్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్‌కి భారీ జరిమానా పడింది. ప్రయాణికులకు సదుపాయాలు అందించడంలో, విమానాశ్రయం నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, తెలంగాణ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఫైన్ వేసి షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాలున్నాయని దాదాపు రూ. 5 లక్షలు ఫైన్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2014 సెప్టెంబర్ 10న సబ్రతో బెనర్జీ అనే వ్యక్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహిస్తోన్న జీఎంఆర్ గ్రూప్‌కి భారీ జరిమానా పడింది. ప్రయాణికులకు సదుపాయాలు అందించడంలో, విమానాశ్రయం నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, తెలంగాణ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఫైన్ వేసి షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాలున్నాయని దాదాపు రూ. 5 లక్షలు ఫైన్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2014 సెప్టెంబర్ 10న సబ్రతో బెనర్జీ అనే వ్యక్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఎస్కలేటర్‌పై వెళ్తుండగా.. సాంకేతిక సమస్యతో ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో బ్యాలెన్స్ తప్పి అందరూ బెనర్జీ మీద పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై.. 75 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లలేకపోయినట్లు కమిషన్‌కి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి ఎయిర్‌పోర్టు యాజమాన్యం.. ఎస్కలేటర్‌పై ఓవర్ లోడ్ అవడంతో ఆగిపోయిందని, అజాగ్రత్తగా ఉండటం వల్లే బెనర్జీ పడిపోయాడని ఎయిర్‌పోర్టు యాజమాన్యం న్యాయస్థానంలో వాదించింది.
అంతేకాకుండా, గాయాలపాలైన బెనర్జీకి చికిత్స అందించామని, గుడ్‌విల్‌గా రూ.1.51 లక్షలు చెల్లించామని తెలిపారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు యాజమాన్యం తెలిపిన వివరాలను విభేదించిన బెనర్జీ, ఆసుపత్రి నుంచి డిస్‌ఛార్జ్ అయి వెళ్లిన తర్వాత తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆపరేషన్ కూడా జరిగిందని వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కమిషన్.. ఎయిర్‌పోర్టు అథారిటీదే తప్పుగా తేల్చి బాధితుడికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.






