- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామాయణం కోసం రహస్య చర్చలు : రావణ్ – రామ్ ఫిక్స్
<p>దిశ, సినిమా : మహారాష్ట్రలో ఈ నెల 22 నుంచి థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్లానింగ్స్ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్.. ఫిల్మ్ మేకర్ జాక్ భగ్నానీ ఆఫీస్‌లో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. భగ్నానీ ఈ ఇద్దరు హీరోలతో ‘రామాయణం’ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ఫస్ట్ మీటింగ్ […]</p>

దిశ, సినిమా : మహారాష్ట్రలో ఈ నెల 22 నుంచి థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్లానింగ్స్ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్.. ఫిల్మ్ మేకర్ జాక్ భగ్నానీ ఆఫీస్‌లో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. భగ్నానీ ఈ ఇద్దరు హీరోలతో ‘రామాయణం’ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇదే ఫస్ట్ మీటింగ్ కాగా డైరెక్టర్ నితీష్ తివారితో పాటు నమిత్, మధు మంతెన సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హృతిక్ రోషన్ రాముడిగా, రణ్‌బీర్ కపూర్ రావణుడిగా ఫిక్స్ అయ్యారని.. అయితే సీత పాత్ర కోసం ఇంకా ఎవరినీ సెలెక్ట్ చేయలేదని టాక్.
కాగా, రామాయణ ఇతిహాసాన్ని డిఫరెంట్ మ్యానర్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉపయోగించి యూత్‌తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా కథను చెప్పబోతున్నట్లు వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టుకు మొదట్లో రూ. 300 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత కథ డిమాండ్ మేరకు మరింతగా పెంచాలని నిర్ణయించుకున్నారని వినికిడి.
- Tags
- Hrithik Roshan






