గ్యాస్ బండ కొనండి.. రూ.10 వేల బంగారం గెలుచుకోండి

174

దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ సామాన్యుడి ఇంట బంగారంతో నింపేందుకు హిందుస్థాన్ పెట్రోలియం ఓ నిర్ణయం తీసుకుంది. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఉపశమనం పొందేలా HP గ్యాస్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దుర్గా నవరాత్రి సందర్భంగా గ్యాస్ సిలిండర్ కొంటే రూ.10,000 వరకు బంగారం గెలుచుకునే అవకాశాన్నిచ్చింది. అయితే, paytm పేమెంట్స్ యాప్ ద్వారా సిలెండర్ ను బుక్ చేసి దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తే రూ.10001 విలువ చేసే బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉందని HP తన ట్విట్లర్లో పేర్కొంది. అయితే, దీని ప్రకారం రోజూ ఐదుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని సంస్థ తెలిపింది.అయితే, ఈ ఆఫర్ ఈ నెల 16వ తేదీ వరకూ ఉండనుంది.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..