టేస్టీ బీట్‌రూట్ మంచూరియా

159

కావాల్సిన పదార్థాలు:

బీట్‌రూట్ -పావు కేజీ
కార్న్‌ ఫ్లోర్‌ -ఒక కప్పు
ఉల్లిపాయలు -అర కప్పు
పచ్చిమిర్చి -5
గరం మసాలా -1 టీస్పూన్
మిరియాలు -అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
సోయాసాస్ -1 టేబుల్ స్పూన్
చిల్లీ సాస్ -అర టేబుల్ స్పూన్
టమోటా సాస్ -1 టేబుల్ స్పూన్
షాజీరా -అర టీస్పూన్
కొత్తిమీర -1 కట్ట
ఉప్పు -రుచికి తగింత
నూనె -తగినంత

తయారీ చేయు విధానం:

బీట్‌రూట్‌ను చాలా సన్నగా తురుముకోవాలి. బీట్‌రూట్ ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని వాటిలో పచ్చిమిర్చి ముక్కలు, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, గరంమసాలా వేసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసుకుని అందులో ఈ ఉండలను డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె కాస్త వేడి చేసుకోవాలి. అందులో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాలు వేగించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులో సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత దీనిలో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బీట్‌రూట్ ఉండలను వేసుకోవాలి. మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పైన గరం మసాలా చల్లుకుని దించేసుకుంటే వేడి వేడీ బీట్‌రూట్ మంచూరియా రెడీ..

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..