సందేహం వద్దు.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!

279

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నివారణ, వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకం. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లేవారికి మాత్రం టీకా ఇవ్వడం లేదు. ఎందుకంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే టీకా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా అంటే..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా selfregistration.cowin.gov.in వెబ్‌సైట్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. (ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు) ఈ లింక్ ఆండ్రాయిడ్, ల్యాప్‌టాప్-కంప్యూటర్(విత్ ఇంటర్నెట్)‌ సహాయంతో ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ఓపెన్ అవడంతోనే మొదటగా రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది.

మొదటి దశ..

STEP 1.. లింక్ ఓపెన్ చేయగానే వెబ్‌పేజీలో రిజిస్టర్ మీద క్లిక్ చేసి 10 అంకెల మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి
STEP 2.. ఆ తర్వాత కిందనే ఉన్న గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే.. ఆరు అంకెలతో ఓటీపీ ‘రిజిస్టర్ మొబైల్ నెంబర్‌’కు వస్తుంది.
STEP 3.. ఇక రెండో పేజీ ఓపెన్ అవ్వగానే మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ ఫర్ వ్యాక్సినేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

రెండోదశ..(రిజిస్టర్ ఫర్ వ్యాక్సినేషన్)

STEP 1.. ఇక ఈ పేజీలో వ్యాక్సిన్ తీసుకునేవారు ముందు ఐడీ ప్రూఫ్ ఏది ఇస్తారో ఎంచుకోవాలి..
STEP 2.. ఆ ఐడీ ప్రూఫ్ నెంబర్ వేయాలి.
STEP 3.. మీరు ఏదైతే ఐడీ ప్రూఫ్ ఇస్తున్నారో.. ఆ కార్డు మీద ఉన్న పేరునే అక్షరం తప్పులేకుండా రాయాలి
STEP 4.. Gender/Male/Female/Others.. ఈ ఆప్షన్‌లో మీ జెండర్‌ను ఎంచుకోవాలి.
STEP 5.. మీ పుట్టిన సంవత్సరం కూడా ఐడీ ప్రూఫ్‌లో ఉన్నట్టే ఎంటర్ చేయాలి.. (నోట్: పుట్టిన రోజు, నెల అవసరం లేదు, ఇయర్ ఒక్కటి చాలు)
ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పింఛన్ పాస్‌బుక్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇచ్చిన గుర్తింపు కార్డు, వీటిలో ఏదైనా గుర్తింపు కార్డును ఉపయోగించవచ్చు.

మూడో దశ..

ఈ ఆప్షన్ నింపగానే వ్యాక్సిన్ రిజిస్టర్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. అకౌంట్ డీటెయిల్స్ అని మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏ రోజు వ్యాక్సిన్ తీసుకుంటారో.. ఎక్కడ తీసుకుంటారో షెడ్యూల్ చేసుకోవాలి. ఈ వివరాలు అన్ని నమోదైన తర్వాత వెబ్‌పేజీలో కనిపించే స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి..

STEP 1.. ఈ పేజీలో షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్‌ మీద క్లిక్ చేయాలి
STEP 2.. మీ రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్ తదితర వివరాలు అన్ని పొందుపర్చాలి
STEP 3.. పూర్తి వివరాలను నమోదు చేయగానే ‘సెర్చ్’ మీద క్లిక్ చేయాలి
STEP 4.. ఇందులో మీ మండల, సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్ల లిస్ట్ వస్తుంది.
STEP 5.. అందులో మీకు దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఎంచుకోవాలి

ఈ ప్రాసెస్ పూర్తవ్వగానే మీరు వ్యాక్సిన్ తీసుకునే తేది, సమయాన్ని ఎంపిక చేసుకొని.. ‘కన్ఫర్మ్’ మీద క్లిక్ చేయండి. దీంతో వ్యాక్సినేషన్ రిజిస్టర్ ప్రక్రియ పూర్తవుతుంది. వెంటనే వ్యాక్సిన్ నమోదు, అపాయింట్మెంట్ వివరాలన్నీ వెబ్‌పేజీలో కనిపిస్తాయి. ఈ పేజీని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ ప్రక్రియ అనంతరం మీ కుటుంబ సభ్యులను కూడా వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేయాలంటే అదే పేజీలో కింద ఉండే Add More మీద క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి. ఒక నెంబర్‌ మీద నలుగురికి వ్యాక్సిన్ రిజిస్టర్ చేయొచ్చు. ఈ ప్రక్రియలో మీకేమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1075 కి కాల్ చేయండి.

నోట్: వ్యాక్సినేషన్ వేయించుకునేవారు ఎంచుకున్న సమయానికి కాస్తా ముందుగానే చేరుకోవాలి. ఇదే సమయంలో వ్యాక్సిన్ రిజిస్టర్ కోసం ఎంపిక చేసుకున్న గుర్తింపుకార్డును తప్పకుండా తీసుకెళ్లాలి.

వ్యాక్సినేషన్ రిజిస్టర్ కోసం ఈ కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయడి

https://selfregistration.cowin.gov.in/

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..