ఇండ్లు వెంటనే కేటాయించాలని ఆందోళన

by  |
ఇండ్లు వెంటనే కేటాయించాలని ఆందోళన
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కట్టెల మండిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ వివాదానికి దారి తీసింది. ఇక్కడ నిర్మించిన 120 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను సోమవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజా సింగ్ లతో కలిసి కేటీఆర్ సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు . కొంతమంది లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ పట్టా కాగితాలను అందజేశారు. అనంతరం పంపిణీ బాధ్యతలను అధికారులకు అప్పగించి అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. అయితే మరి కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లను అధికారులు కేటాయించారు. రెండు రోజుల తర్వాత మిగిలిన వారికి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికల అనంతరం పంపిణీ కొనసాగుతుందని, ఓట్లు వేస్తేనే ఇండ్లు దక్కుతాయని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారని వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో లబ్ధిదారుల లో ఆందోళన మొదలైంది. రోజులు గడిస్తే ఇండ్లు కేటాయించారనే భయంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆబిడ్స్ ఇన్స్పెక్టర్ సీ. అంజయ్య సిబ్బందితో కలిసి కట్టెల మండి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకుండా ఆందోళన కొనసాగించారు. ఇదే సమయంలో నాంపల్లి ఎమ్మార్వో కట్టెల మండి చేరుకుని లబ్ధిదారులకు పట్టా కాగితాలు తప్పకుండా ఇస్తామని, ఎవరు కూడా ఆందోళన చెంద రాదని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed