- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వివాహ సంబంధాల్లో ఆటంకాలు!?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(శనివారం) గ్రహ సంచారం కారణంగా 7 రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సందర్భంగా 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

మేష రాశి
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లల కెరీర్ పరంగా కొంత ఆందోళన ఉంటుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు మెరుగైన లాభాలు రావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. కుటుంబంలో కొన్ని విభేదాలు రావొచ్చు. వ్యాపారస్తులు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవివాహితులకు వివాహ సంబంధాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు పెద్దల సలహాలు మేలు చేస్తాయి.
మిథున రాశి
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓపికగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలసట, ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇష్టదైవారాధన కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. విద్యార్థులు, యువత తమ కెరీర్ సంబంధిత కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
సింహ రాశి
ఈ రాశి వారికి కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ప్లానింగ్స్ వేసుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. బంధువులతో ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
కన్య రాశి
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి తగదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.
తులా రాశి
ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తారు. దీంతో సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికలు చేసేటప్పుడు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరులపై ఆధార పడటం మానేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు సానుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
ఈ రాశి వారు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ స్నేహితుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కుంభ రాశి
ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మీన రాశి
వీరికి ఇది అనుకూల సమయం. శుభ ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.






