- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope: మేషరాశిలో మూడు గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి కెరీర్‌లో ఊహించని మార్పులు!?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) బుధుడు, కుజుడు మరియు సూర్యుడు కలిసి మేషరాశిలో సంచరిస్తున్నారు. దీనివల్ల బుధాదిత్య మరియు ఆదిత్య మంగళ యోగాలు ఏర్పడి మేషం, మిథునం వంటి రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ క్రమంలో ఈరోజు(మే 13) 12 రాశులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశిలోనే గ్రహాల సంచారం వల్ల పని పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అయితే, తొందరపాటు నిర్ణయాలు వద్దు. నాయకత్వ లక్షణాల వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి వీసా స్టాంపింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. గ్లామర్, మీడియా మరియు క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
మిథున రాశి
ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. క్లిష్టమైన సమస్యలు మీ మాటకారితనంతో పరిష్కరిస్తారు. టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు పెరగవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటక రాశి
ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం తో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి జీవితం సాధారణంగా ఉంటుంది. ఈమెయిల్స్ లేదా డాక్యుమెంట్లు పంపే ముందు వివరాలను సరిచూసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. టెక్నికల్ లోపాల వల్ల ఆఫీస్‌లో కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
కన్య రాశి
ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. భారీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. మీ విశ్లేషణాత్మక శక్తికి ప్రశంసలు దక్కుతాయి. ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగాల వారికి పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల రాశి
ఈ రాశి వారికి ఈరోజు బాగుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సైడ్ వర్క్ లేదా అదనపు పనుల ద్వారా చిన్నపాటి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. రిటైల్ లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి టార్గెట్లు సులువుగా పూర్తవుతాయి. చిన్నపాటి పెట్టుబడులు కలిసివస్తాయి.
వృశ్చిక రాశి
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా లీగల్ సంబంధిత వృత్తుల వారికి అనుకూలం.
ధనుస్సు రాశి
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. బాధ్యతలతో పాటు రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య లేదా స్పెషలైజేషన్ కోర్సులు చేయాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది. మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరిగినా, సత్ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మకర రాశి
కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో క్రమంగా పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి సంబంధిత వృత్తుల్లో ఉండే వారికి భారీ లాభాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఓపికతో వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.
కుంభ రాశి
ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశించినంత వేగంగా సాగకపోవచ్చు. వృత్తిపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ, సాయంత్రానికి పరిస్థితులు చక్కబడతాయి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.
మీన రాశి
చంద్రుని సంచారం మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఆర్కిటెక్చర్, డిజైనింగ్ లేదా కళాత్మక వృత్తుల వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ సన్మానాలు అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.






