Today's horoscope:నేటి రాశి ఫలాలు.. అదృష్టం వరించే రాశులివే!

by Jakkula.Mamatha |

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Todays horoscope:నేటి రాశి ఫలాలు.. అదృష్టం వరించే రాశులివే!
X

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ అద్భుతంగా ఉంది. చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ పాటించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల సహాయం అందుతుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం ఉత్తమం.

సింహ రాశి

ఈ రోజు అన్ని విధాల కలిసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

కన్య రాశి

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం సూచిస్తోంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

తుల రాశి

ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి

ఆకస్మిక ధన లాభం ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతోషం కలుగుతుంది. బంధువుల రాక ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఖర్చులు తగ్గించుకోవాలి.

మకర రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి

ఆర్థికంగా బాగుంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి.

మీన రాశి

ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

Next Story