Today's horoscope : ఈరోజు రాశి ఫ‌లాలు.. ఆ రాశి వారికి అదృష్టం క‌లిసొస్తుంది

by Ratna Kumari |

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. ఇవాళ శుక్ర‌వారం మేష‌రాశి నుంచి మొద‌లుకొని మీన రాశి వ‌ర‌కు ఈ 12 రాశుల ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Todays horoscope : ఈరోజు రాశి ఫ‌లాలు.. ఆ రాశి వారికి అదృష్టం క‌లిసొస్తుంది
X

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. గ్ర‌హాల సంచారం రాశి చ‌క్రంలోని 12 రాశుల‌పై ప్ర‌భావం చూపుతాయి. ఇవాళ శుక్ర‌వారం మేష‌రాశి నుంచి మొద‌లుకొని మీన రాశి వ‌ర‌కు ఈ 12 రాశుల ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మేషం :

ముఖ్య‌మైన విష‌యాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఎన్ని ఇబ్బందులు త‌లెత్తినా మ‌నో ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆర్థిక విష‌యాల్లో అప్ర‌మ‌త్త‌త చాలా అవ‌స‌రం.

వృషభం :

ఉద్యోగంలో కొన్ని అధికారిక బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకునే అవ‌కాశం ఉంది. ఆర్థికంగా నిల‌దొక్కుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.

మిథునం :

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆక‌స్మిక ప్ర‌యాణాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబ‌డులు పెడ‌తారు. నిరుద్యోగుల‌కు ఆఫ‌ర్లు ల‌భిస్తాయి.

కర్కాటకం :

వృత్తి, వ్యాపారాల్లో ముఖ్య‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు. కొంద‌రు మిత్రుల‌తో స‌ఖ్య‌త పెరుగుతుంది. మీరు త‌ల‌పెట్టిన ప‌నులు సకాలంలో పూర్త‌వుతాయి.

సింహం :

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధార‌ప‌డే అవ‌కాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ప్ర‌యాణాలు లాభ‌సాటిగా సాగిపోతాయి. ఆర్థిక‌, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల ఒత్తిడి ఉంటుంది.

కన్య :

వ్య‌క్తి గ‌త విష‌యాల పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడ‌తారు. కుటుంబ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతారు. కుటుంబ స‌భ్యుల మీద ఖ‌ర్చు పెరుగుతుంది.

తుల :

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ శ‌క్తి సామ‌ర్థ్యాలు వెలుగులోకి వ‌స్తాయి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాలు సంతృప్తిక‌రంగా ఉంటాయి.

వృశ్చికం :

వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో కొద్దిగా శ్ర‌మ పెరుగుతుంది. ఆర్థిక వ్య‌వ‌హారాలు అనుకూలంగా సాగిపోతాయి.

ధనస్సు :

ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి చాలా వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి.

మకరం :

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించ‌ని ప్రోత్స‌హ‌కాలు ల‌భిస్తాయి. వ్యాపారాల్లో అంచ‌నాల‌కు మించి లాభాలు గ‌డిస్తారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు ప‌రిష్కార‌మ‌వుతాయి.

కుంభం :

వృత్తి, వ్యాపారాలు నిల‌క‌డ‌గా సాగుతాయి. ఆర్థిక ప‌రిస్థితి స‌జావుగా సాగిపోతుంది. కుటుంబ ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తోటి స్నేహితుల నుంచి ఓ శుభ‌వార్త వింటారు.

మీనం :

ఆస్తి, ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. ధ‌న‌ప‌రంగా ఎవ్వ‌రికీ మాట ఇవ్వ‌క‌పోవ‌డం ఉత్త‌మం. అధికారుల‌కు మీ స‌ల‌హాలు చాలా ఉప‌యోగ‌ప‌డుతాయి.

Next Story