- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఈరోజు రాశి ఫలాలు.. వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(శుక్రవారం) గ్రహ సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈరోజు(శుక్రవారం) గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సందర్భంగా 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
మేషరాశి
ఈ రాశి వారి ఇవాళ స్నేహితులతో సమయం గడపడానికి ఎక్కువగా ప్లానింగ్ వేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మొత్తానికి రోజు చివరి భాగంలో మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం బాగుండదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓర్పుతో పని చేస్తే అంత మంచే జరుగుతుంది.
మిథున రాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో విభేదాలు రావొచ్చు. అనుకోని ప్రయాణాలు అలసట పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలిచి వేస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రావొచ్చు.
కర్కాటక రాశి
ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. మొండి బకాయిలు వసూలవుతాయి. దీంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆలయానికి వెళ్లడానికి ఇష్టపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
సింహరాశి
స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య రాశి
శ్రమ అధికమవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం రాకపోవచ్చు. ఆస్తి వివాదాలు కొంత చికాకుగా అనిపిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
తుల రాశి
కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చికం
ఆర్థికంగా కలిసి వస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దగ్గరి బంధువుల ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విజయవంతంగా పనులు సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేయడం వల్ల కాస్త ఒత్తిడి గా ఫీల్ అవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనం జరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మకర రాశి
ఈ రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయం సాధిస్తారు. వీరి ఆలోచన విధానం పై అధికారులకు ప్రశంసలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
కుంభరాశి
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో గొడవలు జరిగే చాన్స్ ఉంది. జాగ్రత్త అవసరం. ఆర్థిక పరమైన విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులున్నాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
మీనరాశి
ఈ రాశివారికి ఇవాళ అద్భుతంగా ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మొండిబకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి. విద్యార్థులకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.






