- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది.

మేష రాశి
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. పనుల్లో విజయం లభిస్తుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
మిథున రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తోంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి
మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహ రాశి
ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
కన్య రాశి
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహ సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు నియంత్రించాలి. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి.
తుల రాశి
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. అకస్మాత్తుగా కలిసి వచ్చే కాలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో స్వల్ప విభేదాలు రావచ్చు.
ధనుస్సు రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
మకర రాశి
పనుల పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి.
కుంభ రాశి
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీన రాశి
ఈ రాశి వారు ఇవాళ శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.






