- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు కాస్త గడ్డుకాలంగా చెప్ప వచ్చు. ఇంట్లోని పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్య సమస్యలు వారి వైవాహిక జీవితం పై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గి లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశం సందర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పనులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వామితో ఆత్మీయమైన సంభాషణలు జరుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు సంతానం ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఇతరులకు అప్పగించకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేసినా సమయాన్ని సరిగ్గా వినియోగించలేకపోవచ్చు. జీవిత భాగస్వామి వల్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగున్నా ఖర్చులు పెరగవచ్చు. సామాజిక కార్యక్రమాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యాలయంలో కుటుంబ సమస్యల ప్రభావం ఉండొచ్చు. రోజు చివర్లో సన్నిహితులతో సమయం గడిపి ఆనందం పొందుతారు.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆహారం నియంత్రించి వ్యాయామం చేయాల్సిన అవసం ఉంది. ఖర్చుల పై నియంత్రణ అవసరం. ఇంటి విషయాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అనుకోని ప్రయాణం అలసట కలిగించవచ్చు. జీవిత భాగస్వామి కీలక విషయాల్లో సహాయం చేస్తారు.
సింహ రాశి
ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత ఆర్థిక ఖర్చు ఉండొచ్చు. కుటుంబంలో సహకారం అవసరం. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉంది. వ్యాపార ప్రయాణాలు భవిష్యత్తులో లాభం తెస్తాయి. భాగస్వామితో ఆనందకరమైన సమయం గడుస్తుంది.
కన్యా రాశి
ఈ రాశి వారికి శరీరానికి విశ్రాంతి అవసరం. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. కార్యాలయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. పిల్లలు మీతో ఎక్కువ సమయం కోరవచ్చు. కుటుంబంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి.
తులా రాశి
ఈ రాశి వారు ఈ రోజు సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. పెట్టుబడుల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమలో ఆనందకరమైన ఆశ్చర్యం కలుగుతుంది. పనుల కారణంగా ప్రియమైన వారితో సమయం గడపలేకపోవచ్చు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన రోజు. వ్యాపారంలో భాగస్వాముల సహాయంతో లాభం పొందవచ్చు. ఇంటి విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. వృత్తిలో తీసుకునే సరైన నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. సాయంత్రం భాగస్వామితో ఆనందంగా గడుస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఆలోచనలను ఈ రోజు కార్యరూపంలోకి తీసుకురావాలి. తెలియని వ్యక్తుల ద్వారా ధనలాభం కలగవచ్చు. కుటుంబం వల్ల కొంత ఒత్తిడి ఉండొచ్చు. కార్యాలయంలో కొత్త వ్యక్తి పరిచయం అవుతుంది. వైవాహిక జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు దీర్ఘకాలిక పెట్టుబడులు మంచివి. సంతానం వల్ల గౌరవం కలుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దలతో సమయం గడిపి జీవిత విషయాలు నేర్చుకుంటారు. భాగస్వామి మాటలు కొంత బాధ కలిగించవచ్చు.
కుంభ రాశి
ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను నియంత్రించాలి. సంతానం ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబంతో సామాజిక కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. భాగస్వామితో కలిసి ఖర్చు చేసినా ఆనందంగా గడుస్తుంది.
మీన రాశి
ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లోనూ బయటా చురుకైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ డబ్బులు అందుతాయి. పిల్లలు ఇంటి పనుల్లో సహాయం చేస్తారు. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడంలో గడపవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మంచి సర్‌ప్రైజ్ లభిస్తుంది.






