- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారి పై అపనిందలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొంత ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. జీవిత భాగస్వామితో ఈ రోజు మంచి సమయం వెచ్చించడంతో అపార్థాలు తగ్గుతాయి. ప్రేమ విషయాల్లో మూడో వ్యక్తి మాటలు నమ్మకండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం లేదా బంధువులు రావడం వల్ల కొంత సమయం వృథా కావచ్చు.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మైగ్రెయిన్ ఉన్నవారు భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతిగా నమ్మిన వ్యక్తి వల్ల కొంత నిరాశ కలగవచ్చు. ప్రేమ విషయాల్లో ఈరోజు ఆచితూచి వ్యవహరించలి. పనిలో కొత్త పద్ధతులు, టెక్నిక్‌లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఈరోజు బిజీగా ఉండే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గుడుపుతారు. ప్రేమలో వ్యవహారంతో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. రోజంతా పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యాయామం చేసేప్పుడు బరువును నియంత్రించుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి అనుకోని బహుమతులు రావచ్చు. కార్యాలయంలో పనిఒత్తిడుతు పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో ఇప్పటివరకు విరోధంగా ఉన్నవారే మిత్రులుగా మారే అవకాశం ఉంది.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనులతో బిజీగా ఉంటారు. తోబుట్టువుల సహకారంతో ఆర్థికంగా కొంత లాభం కలగవచ్చు. వ్యాపారంగాల వారికి తోబుట్టువులు ఇచ్చే సలహాలు ఉపయోగపడతాయి. ప్రేమ జీవితంలో భాగస్వామి కొత్త కోణాన్ని తెలుసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. మంచి-చెడుల మిశ్రమంగా రోజు ఉండి కొంత అలసట, అయోమయం కలిగించవచ్చు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాల పై కొంత ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో బంధువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఒక సర్ప్రైజ్‌తో మిమ్మల్ని ఆనందింపజేస్తారు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి ప్రశాంతంగా గడుస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం ఖర్చు చేసి మానసిక ఆనందం పొందుతారు. మీపై ప్రేమ, శ్రద్ధ చూపించే వారితో సానుకూలంగా ఉండండి. అవసరం లేని అల్లరి, ఈవ్ టీజింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వారికి మీ అభిప్రాయాలు చెప్పితే గౌరవం, లాభం పొందే అవకాశం ఉంది. మీ ఆలోచనలను ధైర్యంగా చెప్పండి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కొంత అలసట, ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. మీ సమస్యలను ఇతరులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ప్రేమవిషయాల్లో మంచి భావనలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటే మంచి ఫలితం పొందుతారు. ప్రయాణ ప్రణాళికలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి చేసిన ఒక మంచి పని ఈ రోజును మీకు ప్రత్యేకంగా మార్చవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రాశివారికి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉండనున్నాయి. ఈ రోజు అనుకోని శుభవార్త విని కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. పని విషయంలో మంచి అవకాశాలు వస్తాయి. సాయంత్రం సమయంలో మీకు దగ్గరైన వారిని కలిసే అవకాశం ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు తినేటప్పుడు, తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడి అవకాశాలు పెట్టే అవకాశం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం మీకు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగు పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశముంది. కార్యాలయంలో మంచి గుర్తింపు వస్తుంది.
కుంభ రాశి
ఈ రోజు మీరు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించడం మంచిది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. ప్రభావశీలుల పరిచయం మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. మీ రూపురేఖలు, ప్రవర్తనలో చిన్న మార్పులు చేస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి భోజనం, రొమాంటిక్ క్షణాలతో రోజు ఆనందంగా గడుస్తుంది.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారి మేధాశక్తి వల్ల సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సానుకూల ఆలోచనలు మీకు సహాయపడతాయి. ఈరోజు డబ్బును ఎలా సరైన విధంగా ఖర్చు చేయాలో తెలుసుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాయంత్రం గడపాలని ప్లాన్ చేయండి. ప్రేమ విషయాల్లో భావోద్వేగంగా మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో ఒక విషయం పంచుకోవడం మరిచిపోవడం వల్ల చిన్న విభేదాలు కలగవచ్చు.






