- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:ఈ రోజు రాశి ఫలాలు(31-10-2025)
ఈ రోజు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోండి.

మేష రాశి
ఈ రాశి వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వసూలు కానీ బాకీలు వసూలవుతాయి. దీంతో ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు. అనుభవజ్ఞులను కలిసే అవకాశాలు ఉన్నాయి. వారు మీకు భవిష్యత్తు గురించి వివరిస్తారు. దాంపత్య జీవితం బాగుంది.
వృషభ రాశి
ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణాలు(అప్పు) తీరుస్తారు. సహోద్యోగులు నుంచి సహాయం అందుతుంది. ఈ రోజంతా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మిథున రాశి
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నట్లైతే ఈరోజు అనుకూలంగా ఉంది. ఏదైనా పని ప్రారంభించినట్లైతే ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామి పై కాస్త ఒత్తిడి పెంచుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు పనిచేసే ఏ రంగంలోనే ఒత్తిడి పెరుగుతుంది. ఓపికతో ఉండటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలలోను కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే, సమీప సన్నిహితుల సలహా తీసుకోండి. జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తుంటారు. దీంతో రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుండి మీకు ఆర్ధిక సహాయం అందుతుంది. గత పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని కలుస్తారు. మీరు పనిచేసే ఆఫీస్‌లో ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సహంగా పనిచేస్తారు. మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమనే విషయం మీకు తెలుసు.. కానీ దానిని అమలు పరచడంలో విఫలమవుతారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య రాశి
కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. స్నేహితులు, మీకు సపోర్ట్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వ్యాపార విషయంలో ఇంట్లో వారి నుంచి ఆర్థిక సాయం అందుతుంది. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి. లేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో బయటకు వెళతారు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు.
తులా రాశి
చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసివస్తుంది. ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గరివారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ గురించి పని చేయడానికి కూడా ఇది మంచి సమయం. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ఇంటి పెద్ద వారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మిత్రులతో గడిపే సాయంత్రం మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకుంటారు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. రోజులో చాలా వరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు. ప్రేమ జీవితం బాగుంది.
ధనుస్సు రాశి
సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం, మానసిక ఉద్వేగానికి గురవుతారు. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు దానధర్మాలు చేయడం వల్ల మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, మంచి అనుకూలమైన రోజు. ఈ రోజు ప్రేమలో ఉన్న వారు ప్రత్యేకమైన అనుభూతి చెందుతారు. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరంగా పరిగణించక పోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు.
మకర రాశి
గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల వస్తుంది. సోదరీ ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కానీ, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని అదుపుచేసకోండి. లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం గొడవపడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి.
కుంభ రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని టెన్షన్, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, అసౌకర్యానికి గురి చేస్తాయి. మీ మంచి కోరుకునే వారు ఎవరో, చెడు కోరుకునే వారు ఎవరో గుర్తించి వారితో తగిన విధంగా ప్రవర్తిస్తారు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆఫీస్ లో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.
మీన రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ధ్యానం మంచి రిలీఫ్ నిస్తుంది. ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ప్రేమ జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొత్త ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. సమయం వృధా చేయకండి. భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా గడుపుతారు.






