- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు(20-10-2025)
ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకోండి.

మేష రాశి
ఈ రాశి వారికి ఇవాళ అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వీరి సంతానం వల్ల కొంత ఇంట్లో ఆనందం కలుగుతుంది. ఈ రోజు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం సూర్య భగవానుడిని ఆరాధించండి.
వృషభ రాశి
మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించండి. వీరికి ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం కుటుంబంలో మీ పై కోపం పెంచుకునే అవకాశం ఉంది. దీంతో భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరగొచ్చు. ప్రశాంతంగా ఉండండి.
మిథున రాశి
ఈ రోజు రిలాక్స్ అయేలాగా సరియైన మంచి మూడ్ లో ఉంటారు. వ్యాపారంలో, ఏ విషయంలోనైనా కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి.
కర్కాటక రాశి
ఈరోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండాలి. భగ్నప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు. ముందు ఒప్పుకున్న తప్పు, మీకు అనుకూలంగా మారుతుంది. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది.
సింహ రాశి
మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సలహాలు తోడ్పడతాయి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. మంచి ఆరోగ్యం కోసం శివుడిని పూజించండి.
కన్యా రాశి
ఈ రాశి వారు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికో వ్యక్తివద్దకో వెళ్ళండి. ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తారు.
తులా రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ఈరోజు మదుపు చేయడం మానాలి. ఆఫీసులో ప్రతి దానిపైనా ఈ రోజు మీదే పైచేయి కానుంది. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా, ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయినవారు తారసపడతారు. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
వృశ్చిక రాశి
మీరు భయం అనే భయంకరమైన ఆలోచనలతో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలచుకోండి. లేకపోతే మీరు మిన్నకుండిపోయి దానిని ఎదురు చెప్పక లొంగిపోతారు. చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ప్రయాణాలు కలిసిరావు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి వ్యాపారంలో బాగుంది. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈరోజు దగ్గరి బంధువుల సాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు.
మకర రాశి
అతిగా ఖర్చు చేయడం మానుకోండి. మీ పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు. ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది. ఈ రోజు మీ సమయాన్ని ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి.
కుంభ రాశి
మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు, మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి కృషి చేస్తుంటారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి.
మీన రాశి
అంతులేని మీ ఆత్మ విశ్వాసం, మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్ట్ గా ఉంటారు.






