- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today's Horoscope:ఈ రోజు రాశి ఫలాలు(24-09-2025)
ఈరోజు రాశిఫలాలు తెలుసుకోండి.

మేషరాశి
ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. గతంలోని కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. తెలివితేటలతో పెద్దల్ని మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ముఖ్య విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. మీ కాలాన్ని వృధా చేసే వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.
వృషభం
గ్రహస్థితి బాగుంది. జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమ ఉన్నా టెన్షన్ పడకండి. అంతిమ విజయం మీదే. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఇంటి నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని పూజించండి.
మిథునం
వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. బుధుడి ప్రభావంతో శక్తివంతమైన ఆలోచనలు వస్తాయి. మీ నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను తీసుకొస్తాయి. ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానానికి చేరుకుంటారు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. సూర్యుడిని పూజించండి.
కర్కాటకం
ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తిగా చేసుకోవచ్చు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత లక్ష్యానికి ప్రణాళిక తయారు చేసుకుంటారు. తోటివారి సహాయం అందుతుంది. ఇది మానసిక ఆనందానికి తోడ్పడుతుంది. నవగ్రహాలను పూజించండి.
సింహం
అదృష్టం ఉంది. విజయాలు గోచరిస్తున్నాయి. ధీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. నలుగురితో కలుపుగోలుగా ఉండండి. మహాలక్ష్మిని పూజించండి.
కన్య
మనోబలంతో ముందుకు వెళ్ళండి. చెడు విమర్శలను మనసులోకి తీసుకోవద్దు. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలం. నవగ్రహాలను దర్శించుకోండి.
తుల
ఆర్థిక పరిస్థితులు అనుకూలం. కొత్త ఆదాయ మార్గాలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీదైన ప్రతిభతో వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రశ్యాతలు పొందుతారు. ఇష్టదైవ ఆరాధన చేయండి.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలం. పెద్దల ప్రశంసలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శుక్రగ్రహ శ్లోకాన్ని పఠించండి.
ధనస్సు
కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఇది మానస సంతృప్తిని కలిగిస్తోంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇతరుల సలహాలపై ఆధారపడకండి. సొంత నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మకరం
మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మాటలతో పక్కదారి పట్టించే వారితో జాగ్రత్తగా ఉండాలి. దైవ బలం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శివుడిని పూజించండి.
కుంభం
ఏ పనినైనా వాయిదా వేయడం అస్సలు మంచిది కాదు. సరైన నిర్ణయాల తీసుకోవడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. నవగ్రహాలను దర్శించుకోండి.
మీనం
ఈ రాశి వారు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో సున్నితంగా మాట్లాడండి. గ్రహ దోషం ఉంది. గొడవలకు వెళ్లకపోవడం మంచిది. మీ సహనమే మిమ్మల్ని కాపాడుతుంది. కాలాన్ని వృధా చేయకండి. మనోధైర్యం గా ఉండండి. నవగ్రహ ఆరాధన తో మంచి ఫలితాలు లభిస్తాయి.






