Today's Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( ఏప్రిల్ 21)

by Batti.Sumithra |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది.

Todays Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( ఏప్రిల్ 21)
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజు ఏప్రిల్ 21 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

ఈరోజు ఈ రాశి వారికి సమయం బాగా దొరుకుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అప్పులు తీసుకుని ఉంటే తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు.

వృషభ రాశి

ఈరోజు ఈ రాశి వారు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. పెట్టిన పెట్టుబడులలో లాభాలు వస్తాయి. ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

మిథున రాశి

ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడుల నుంచి లాభాలు చేకూరుతాయి. భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఎదగడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు.

కర్కాటక రాశి

ఈరోజు ఈ రాశి వారు చేసే మంచి పనులతో మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సద్దమణుగుతాయి. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహ రాశి

ఈరోజు ఈ రాశి వారికి కార్యాలయంలో, ఇంటి సమస్యలతో చిరాకు రావచ్చు. రావలసిన పాత బకాయిలు వస్తాయి. ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు అధికంగా ఉండవచ్చు.

కన్య రాశి

ఈరోజు ఈ రాశి వారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. పిల్లల వల్ల ఆనందం, లాభం కలుగుతుంది. బంధువులు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేయాల్సిన పనులు కొంచెం ఆలస్యమవుతాయి.

తుల రాశి

ఈరోజు ఈ రాశి వారు నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలి. సేవింగ్స్ ప్లాన్ కొంచెం అడ్డంకి పడుతుంది. ఇంట్లో కొత్త వ్యక్తి రావచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీకు రావాల్సిన పాత బకాయిలు వసూలు కావచ్చు.

వృశ్చిక రాశి

ఈరోజు ఈ రాశి వారు ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సృజనాత్మక పనులకు మంచి పేరు వస్తుంది. పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి

ఈరోజు ఈ రాశి వారి మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు. వ్యాపార పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఉద్యోగంలో తోటివారి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో సరదాగా సమయాన్ని గడుపుతారు.

మకర రాశి

ఈరోజు ఈ రాశి వారు కుటుంబంలో జరిగే గొడవలతో బాధలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన బకాయిలు వస్తాయి. పిల్లలతో సమయాన్ని గడుపుతారు. ఆఫీస్‌లో పని సులభంగా పూర్తవుతుంది.

కుంభ రాశి

ఈరోజు ఈ రాశి వారు అవసరానికి మించిన టెన్షన్ పడకండి. కొత్త ఐడియాలతో డబ్బు సంపాదించవచ్చు. పాత అప్పులు తీరుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు. భాగస్వామితో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

మీన రాశి

ఈరోజు ఈ రాశి వారు ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి. అనుభవం ఉన్నవారి సలహాతో పెట్టుబడులు పెట్టండి. ఇంట్లో చిన్న టెన్షన్ ఉండొచ్చు. ఫ్రెండ్‌ను చాలా కాలం తర్వాత కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాల పై ఆసక్తి పెరుగుతుంది.

Next Story