- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope (april 14) : ఈరోజు రాశి ఫలాలు
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి సమయం బాగా దొరుకుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు సర్దుకుంటాయి. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు వస్తాయి.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వ్యక్తి వల్ల నిరాశ కలగొచ్చు. కొత్త పనులు మొదలు పెట్టడానికి మంచి రోజు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆఫీస్‌లో ప్రెషర్ వల్ల మనసు చికాకుగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కొంత టైం గడపండి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం ఈరోజు బాగుంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి హుషారుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల బంధువులు సంప్రదిస్తారు. ఖాళీ సమయంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి అనుకోని అతిథులు వస్తారు. మీ నవ్వు ఇతరుల బాధను తగ్గిస్తుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. రోజు కాస్త అలసటగా అనిపించినా తర్వాత బాగుంటుంది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. ఇంట్లో కొత్త వార్తలు ఆనందం ఇస్తాయి. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అనుకోని అతిథులు వస్తారు. ఏ విషయంలో అయినా అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఖర్చులు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు. బంధువులతో ఏర్పడిన చిన్న గొడవలు సర్దుకుంటాయి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారికి శారీరకంగా, మానసికంగా బలహీనంగా అనిపిస్తుంది. వీరికి ఈ రోజు విశ్రాంతి చాలా అవసరం. వ్యాపారంలో నష్టాలు కలగవచ్చు. విదేశీ వ్యాపారాలకు మంచి ఫలితాలు అందుతాయి. జీవిత భాగస్వామి ప్రేమ దొరుకుతుంది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తగ్గుతాయి. జీవితంలో మార్పులు చేసుకునేందుకు మంచి సమయం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు చేయడం వల్ల సరదాగా ఉంటారు. మీ వస్తువులపై జాగ్రత్తగా ఉండాలి. దొంగతనం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు.






