Today Horoscope: ఈరోజు రాశి ఫలాలు(06-04-2025)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-05 22:30:55  IST  )

నేడు ఈ రాశి వారు మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోష పెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.

Today Horoscope: ఈరోజు రాశి ఫలాలు(06-04-2025)
X

మేష రాశి:

నేడు ఈ రాశి వారు మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోష పెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు.

వృషభ రాశి:

మీరు చేసిన ఏ పనులు అయినా సరే మీ చుట్టూ ఉన్నవారిని మెప్పిస్తాయి. ఫ్రెండ్స్ తో కలిసి పిక్‌నిక్ వెళ్తారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవండి. యోగా చేయడం మంచిది. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథున రాశి:

బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి:

సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

సింహ రాశి:

పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది.

కన్యా రాశి:

కూతూహాలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి. మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.

తులా రాశి:

మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.

వృశ్చిక రాశి:

పిల్లల్ని బాగా మోటివేట్ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కుతుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోంటారు. నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి.భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

ధనుస్సు రాశి:

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఊహించనివారి నుంచి డబ్బు అందుకుంటారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి.ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.

మకర రాశి:

ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా గడుపుతారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు.

కుంభ రాశి:

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బంధువుల ఇంటికెళ్తారు. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

మీన రాశి:

ప్రమోషన్లు అందుకుంటారు. నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు. వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

Next Story