Today's Horoscope: ఇవాళ రాశి ఫలాలు (3-03-2026)

by Kodari Anjali |

మార్చి 3 వ తారీకున 12 రాశులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Todays Horoscope: ఇవాళ రాశి ఫలాలు (3-03-2026)
X

మేష రాశి: నేడు ఆర్థికంగా పుంజుకుంటారు. కానీ మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బందికి గురి అవుతారు.. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. కానీ చిన్న విషయాలకే ఎక్కువ ఆందోళన చెందకూడదు. శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. ప్రశాంతత కోసం బయటికి పార్క్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు.

వృషభ రాశి: ఆర్థికంగా కొంత నిరాశ చెందుతారు. అనవసరమైన మాటలతో మిమ్మల్ని ఇతరులు బాధ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఫలితం దక్కుతుంది. ఎక్కువగా బుక్స్ చదువుతారు. కానీ మానసిక ఆందోళనకు గురి కావద్దు. స్నేహితులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా వీక్ అవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథున రాశి: నేడు ఇంట్లో కార్యక్రమాలకు జరుపుకోవడానికి మంచి రోజు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు వస్తాయి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఇవాళ తల్లిదండ్రులతో బయటకు వెళ్తారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

సింహ రాశి: పార్క్ కు వెళ్లి ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ భాగస్వామితో నేడు అన్ని విషయాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. డబ్బు పరంగా కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

కన్యా రాశి: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

తులా రాశి: ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు.

మకర రాశి: ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.

కుంభ రాశి: విదేశాలకు వెళ్లేందుకు మంచి రోజు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.

మీన రాశి: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు. మనోదైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలేర్పడతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది.

Next Story