Today's horoscope: ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం.. 12 రాశుల ఫలితాలు ఇవే!

by Jakkula.Mamatha |

ఈ రాశి విద్యార్థులకు ఇది అనుకూల సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.

Todays horoscope: ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం.. 12 రాశుల ఫలితాలు ఇవే!
X

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ రోజు(ఫిబ్రవరి 26, 2026) గురువారం చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాశి చక్రములోని 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీస్‌లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది అనుకూల సమయం. కంటికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి

ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీ పట్టుదలతో అన్నింటినీ అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మౌనంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

మిథున రాశి

ఈ రాశి వారికి అదృష్టం కలిసొచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల ద్వారా లాభాలు చేకూరే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. అవి మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి

వీరు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మానసిక ఆందోళన కలగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలను రేపటికి వాయిదా వేయడం మంచిది. ఎవరితో వాదనలకు దిగకండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ తలనొప్పి లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు.

సింహ రాశి

ఈ రాశి వారికి ఇవాళ బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామి నుంచి ఊహించని బహుమతి అందుకునే అవకాశం ఉంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కన్య రాశి

ఈ రాశి వారు ఇవాళ శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

తులా రాశి

ఈ రాశి విద్యార్థులకు ఇది అనుకూల సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి (కళలు, రచనలు) అద్భుతమైన రోజు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలం. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే ఆలోచన చేస్తారు. తల్లి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.

ధనుస్సు రాశి

మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మార్కెటింగ్ రంగం వారికి మంచి రోజు. స్వల్ప లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మకర రాశి

ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మాట విషయంలో సంయమనం పాటించండి. కఠినంగా మాట్లాడటం వల్ల బంధాలు దెబ్బతినవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ రాశి

చంద్రుడు కుంభ రాశిలోనే ఉండటం వల్ల ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సొంత నిర్ణయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి

ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త అందుతుంది. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Next Story