Today's horoscope(11-04-2026): ఈ రోజు అదృష్టం వరించే రాశులివే!

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

Todays horoscope(11-04-2026): ఈ రోజు అదృష్టం వరించే రాశులివే!
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పులు దైనందిన జీవితంలో ఎదురయ్యే విజయాలు, సవాళ్లు మరియు అవకాశాలకు సంకేతాలుగా నిలుస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. బాకీ పడ్డ డబ్బు చేతికి అందుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు.. కాబట్టి ఆలోచించి అడుగు వేయండి. ఇష్టదైవారాధన మేలు చేస్తోంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల మనశ్శాంతి కోల్పోయే ప్రమాదం ఉంది. మీ మాటతీరుపై నియంత్రణ అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

మిథున రాశి

ఈ రాశి వారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణం చేయాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలకు అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దైవ ప్రార్థన మీకు మానసిక బలాన్ని ఇస్తుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తిస్తారు. ప్రేమికులకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు.

కన్య రాశి

ఆర్థికంగా బాగుంటుంది కానీ మానసిక ఆందోళన కొంత వేధించవచ్చు. పనిలో పారదర్శకత అవసరం. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. భూ సంబంధిత లావాదేవీలకు ఈ రోజు అనుకూలం.

తుల రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరపు ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది పడతారు. మిత్రులతో మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి, మౌనంగా ఉండటం ఉత్తమం. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడికి తగిన లాభం వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వాహనం నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.

మకర రాశి

ఈ రాశి వారు ఇవాళ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా మారుతాయి.

కుంభ రాశి

నూతన ప్రాజెక్టులు చేపడతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆలోచనలను సన్నిహితులతో పంచుకుంటారు.

మీన రాశి

స్త్రీలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ, దానికి తగిన ఆదాయం కూడా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవారాధన చేయండి.

Next Story