- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఈ రోజు తిరుగులేదు!
ఈ రోజు గ్రహాల సంచారం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ తరుణంలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రోజు గ్రహాల సంచారం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 6, బుధవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ప్రయాణాల వల్ల స్వల్ప అలసట కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తాలు అవసరం.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీ నిర్ణయాలకు అందరి మద్దతు లభిస్తుంది. కేరీర్ బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణాళికబద్ధంగా పని చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
మిథున రాశి
ఈ రాశి వారు ఇవాళ సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి చూపుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి, సంయమనం పాటించండి. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనూకుల సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు చదువులో దూసుకుపోతారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
కన్య రాశి
ఉద్యోగులకు పదోన్నతి లేదా సానుకూల మార్పులు కలిగే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ పట్టుదలతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
తుల రాశి
ఈ రాశి వారికి ధార్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆకస్మిక ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. వైవాహిక జీవితం బాగుంటుంది.
ధనుస్సు రాశి
వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషక్ర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి.
మకర రాశి
శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వృత్తి రీత్యా ప్రశంసలు అందుకుంటారు. సమయపాలన పాటిస్తూ పనులను పూర్తి చేస్తారు. ఇంట బయట ఈ రాశి వారికి బాగుంటుంది.
కుంభ రాశి
పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వినోద కార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు. అయితే, ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు.
మీన రాశి
ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. తల్లి తరపు బంధువుల నుండి సహాయం అందుతుంది. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.






