- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఆ రాశుల వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(ఏప్రిల్ 12) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి: ఆర్థిక విషయాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బంధువులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులు రావచ్చు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పని చేస్తారు. సన్నిహితులతో స్వల్ప విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహ రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు లేదా భూములు కొనే అవకాశం ఉంది. ధనలాభం సూచిస్తోంది.
కన్య రాశి: పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.
తుల: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. ఆలయ సందర్శన వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
వృశ్చిక రాశి: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ యోగం ఉంది.
ధనుస్సు రాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు.
మకర రాశి: ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వస్తు లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
కుంభ రాశి: పనుల్లో వ్యయప్రయాసలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల విషయంలో కొంత నిరుత్సాహం కలగవచ్చు.
మీన రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూల సమయం.






