Today's horoscopes:గ్రహాల సంచారం.. ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే?

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

Todays horoscopes:గ్రహాల సంచారం.. ఈ రోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే?
X

Today's horoscopes:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఆ మార్పులు వ్యక్తుల దైనందిన జీవితంలో ఎదురయ్యే విజయాలు, సవాళ్లు మరియు అవకాశాలకు సంకేతాలుగా నిలుస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాల సంచారం కారణంగా ఈ రోజు(సోమవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

ఈ రోజు 12 రాశుల ఫలితాలు..

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనుల్లో కొంత ఆలస్యం జరగొచ్చు, కానీ పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. శివారాధన శుభకరం.

వృషభ రాశి

ముఖ్యమైన పనుల్లో ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక కలహాలకు తావు ఇవ్వకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

చాలా కాలంగా వేధిస్తున్న రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి.

సింహ రాశి

కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణాల వల్ల కొంత అలసట కలగొచ్చు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కన్య రాశి

మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి

శుభవార్తలు వింటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. అలంకార వస్తువుల మీద పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు.

వృశ్చిక రాశి

పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించడం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి

సృజనాత్మక ఆలోచనలతో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబం నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకర రాశి

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగి ఆనందంగా ఉంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. గతంలోని గొడవలు సమసిపోతాయి.

కుంభ రాశి

వేగంగా పనులు పూర్తి చేస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. సంయమనం పాటించడం అవసరం. వైవాహిక జీవితం బాగుంటుంది.

మీన రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కానీ.. ఆదాయం బాగున్నా విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. శివాలయాన్ని సందర్శించడం ఉత్తమం.

Next Story