- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:చంద్రుడు మకర రాశిలో ప్రవేశం.. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే?
ఇవాళ(గురువారం) చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మరియు గురుడు పరస్పర వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల ఈ రోజు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సూర్యుడు, బుధుడు కలయికతో మేష రాశిలో బుధాదిత్య యోగం కొనసాగుతోంది. శుక్రుడి అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ రోజు(మే 07) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడిన మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృషభం
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ చిన్న విషయాలకు కోపం రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదం.
మిథునం
ఈ రాశి వారికి చాలా అనుకూలమైన కాలం. పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. అధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మరియు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది. చేపట్టిన పనులు తోటి వారి సహకారంతో పూర్తవుతాయి. అస్థిర ఆలోచనలు ఇబ్బంది కలిగించవచ్చు, కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
సింహం
ఈ రాశి వారు పనుల్లో ఉత్సాహం పెంచుకోవాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక ప్రణాళికలు అవసరం. ఖర్చులు పెరగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం అవసరం. శ్రీరామ నామ స్మరణ మేలు చేస్తుంది.
కన్య
ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అనుకున్నది సాధించే వరకు పట్టుదల అవసరం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
తుల
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అకస్మాత్తుగా బంధువుల రాక సంతోషాన్ని కలుగజేస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనస్సు
మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది.
మకరం
గజకేసరి యోగం వల్ల ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం తోడుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శని దేవుని స్థానం కావడంతో, తీవ్రమైన బాధ్యతలతో పాటు, ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన అనుభవం పెరుగుతుంది.
కుంభం
ముఖ్యమైన పనులు వాయిదా వేయకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రీరామ నామ స్మరణం మంచి ఫలితాలు ఇస్తుంది.
మీనం
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇష్ట దైవ ప్రార్థన శుభఫలితాలనిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.






