- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఆ రాశుల వారికి కెరీర్‌లో పురోగతి.. ఈ రోజు 12 రాశుల ఫలితాలు ఇలా!?
ఆకస్మిక ధన లాభం లేదా కెరీర్‌లో పురోగతి కనిపిస్తోంది.

మేషం
ఈ రాశి వారికి ఇవాళ వృత్తిపరంగా ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మీ పనిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు. మాటల విషయంలో సంయమనం పాటిస్తే వైవాహిక బంధం సుఖంగా ఉంటుంది.
వృషభం
భూ సంబంధిత వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం లేదా కెరీర్‌లో పురోగతి కనిపిస్తోంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది.
మిథునం
ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొత్త అవకాశాలు వచ్చే సూచన ఉంది. జీవిత భాగస్వామి మద్దతు మీకు అన్ని విధాలా అందుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం
నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తిలో అధికారుల మెప్పు పొందుతారు.
గృహంలో చిన్నపాటి గందరగోళం ఉండవచ్చు. ఓర్పుతో వ్యవహరించడం వల్ల వివాదాలను నివారించవచ్చు.
సింహం
మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు.
కన్య
కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సంతాన విషయమై శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
తుల
ఉద్యోగంలో కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు. విభేదాలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
వృశ్చికం
ఈ రాశి వారు వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు మరియు సహకారం అందుతాయి. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.
ధనుస్సు
పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ మార్పుల కోసం చూస్తున్న వారికి అనుకూలమైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మకరం
సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ప్రశంసలు అందుతాయి. కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. మిత్రులతో ఆనందకర సమయం గడుపుతారు. వివాహ సంబంధాల విషయంలో పెద్దల సలహా మేలు చేస్తుంది.
కుంభం
ఉద్యోగంలో సమస్యలు తొలగి రాజయోగం వంటి ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీనం
వృత్తి వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సమయం కేటాయించడం ముఖ్యం.






