- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Astrology: వచ్చే నెల నుంచి ఆ రాశుల వారికీ అఖండ ధనయోగం.. మీ రాశి ఉందా?

దిశ, వెబ్ డెస్క్ : వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ముఖ్యంగా, గ్రహాలన్నిటిలో బృహస్పతి గ్రహం ఆశీర్వాదం ఉంటే వారు జీవితంలో అన్నీ పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే ఎవరి జీవితంలో అయితే, గురువు స్థితి మంచిగా ఉండదో వారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఫిబ్రవరి 4వ తేదీన 119 రోజుల తర్వాత గురు ప్రత్యక్షం కానున్నాడు. ఈ కారణంగా రెండు రాశుల వారికీ ధన లాభాలు కలగనున్నాయి. ఆ రాశులలేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
బృహస్పతి వలన మేషరాశి వారు ఎన్నో ప్రయోజనాలు పొందనున్నారు. ముఖ్యంగా, ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మేషరాశి వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతే కాదు, ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మీరు పని చేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. మీ కుటుంబ జీవితం బాగుంటుంది.
కన్యా రాశి
బృహస్పతి వలన కన్యా రాశి వారు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ప్రవేశించనున్నాడు. ఇది వారికి సానుకూల ఫలితాలనిస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పెళ్లి కానీ యువతి యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.