- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope(23-01-2026): ఈ రాశి వారు ఆ విషయంలో.. కొంచెం ఏమరపాటుగా ఉన్న భారీ నష్టం!?
5 రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసివస్తోంది. కానీ, గ్రహ సంచారం కొన్ని రాశుల పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోందాం.

మేషరాశి
ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనుకున్న పనులు అనుకున్న సమయంలోనే పూర్తిచేస్తారు. దీంతో సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు రావచ్చు. అప్రమత్తంగా ఉండడం మంచిది. స్నేహితులతో కాలక్షేపం చేయడం మానుకోండి. మీ లక్ష్యం పై దృష్టి పెట్టండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఇవాళ బాగా కలిసి వస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడంతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వారు పరిచయం అవుతారు. వారితో జాగ్రత్తగా ప్రవర్తించండి. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయం గా ఉంటుంది. విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది. కానీ, మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మిథున రాశి
ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. లేదంటే ఇతరుల విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది. అందరితో ఒకే విధంగా ఉండటం మంచిది. ఇతరులను కామెంట్ చేయడం మానుకోండి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు వీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. దీంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వీరికి స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ, మ్యాచ్ ను కానీ ఇంట్లో చూస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహరాశి
ఆశించిన ఫలితాలను పొందడానికి సమయం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.
కన్య రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తోంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారి ఇవాళ ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడతాయి. దీంతో మీరు నిరాశతో బాధపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రేమ వ్యవహారంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
తులా రాశి
ఈరోజు వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి సమయం. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. దీంతో మీ కుటుంబంలో ఆనందర వాతావరణం నెలకొంటుంది. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మొబైల్ ఎక్కువ సేపు వినియోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ చాలా బాగుంది. ఆర్థికంగా కలిసి వస్తోంది. పెళ్లి కానీ వారికి వివాహ సంబంధాలు వస్తాయి. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికి చెప్పేస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. ఈ విషయంలో కొంచెం ఏమరపాటుగా ఉన్న ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఈరోజు ఆనందంగా గడుపుతారు.
మకర రాశి
ఈ రాశి వారు నేడు మనోబలంతో ముందుకు సాగండి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కుంభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. కుటుంబంతో, స్నేహితులతోను సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం బాగుంది. ఈ రోజులో కొంత సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంది.
మీనరాశి
ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమైన విషయాల్లో శుభ ఫలితాలు పొందుతారు. అందరితో ఐక్యమత్యంగా ఉంటారు. ఇది మీ మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.






