Today's Horoscope: (13-03-2026): నేడు రాశి ఫలాలు

by Kodari Anjali |

మార్చి 13 వ తారీకున 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Todays Horoscope: (13-03-2026): నేడు రాశి ఫలాలు
X

మేష రాశి: నేడు చాలా మంది మిమ్మల్ని మాటలతో పొగుడుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది.. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుూడుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఏ పని ముట్టుకున్నా సక్సెస్ ఉంటుంది. మీ భాగస్వామితో బయటకు వెళ్తారు.

వృషభ రాశి: డబ్బు పరంగా జాగ్రతగా ఉండాలి. ఇతరులను ఎక్కువగా నమ్మి అన్ని విషయాలు చెబుతారు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా వీక్ అవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథున రాశి: దూరపు చుట్టాలు దగ్గరవుతారు. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.

కర్కాటక రాశి: ఇవాళ ఏ పని చేసినా తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంటికి చుట్టాలు వస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌ను మీట్ అవుతారు. బయటకు వెళ్తారు. మీ భాగస్వామి తనలోని మరో కోణాన్ని చూపిస్తారు.

సింహ రాశి: మీ అప్పుల బాధ నేటితో పోతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మీ భాగస్వామి మీతో అన్ని విషయాలు చెప్పుకుంటారు.

కన్యా రాశి: వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

తులా రాశి: కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

వృశ్చిక రాశి: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఉద్యోగులకు మిశ్రమ సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు రాశి: విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకర రాశి: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

కుంభ రాశి: ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలేర్పడతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది. మీ దురుసుతనం వల్ల ఇతరులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీన రాశి: నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.

Next Story