హోండా సరికొత్త ఎస్‌పీ125 మోడల్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్

by  |
హోండా సరికొత్త ఎస్‌పీ125 మోడల్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ కంపెనీ తన కొత్త హోండా ఎస్‌పీ 125 ండల్ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో కస్టమర్లకు రూ. 5,000 వరకు లబ్ది ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా హోండా కంపెనీ ఒప్పందం చేసుకున్న బ్యాంకుల నుంచి ఫైనాన్స్ తీసుకున్న కస్టమర్లకు మాత్రమే లభించనుంది.

హోండా ఒప్పందం చేసుకున్న బ్యాంకుల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్ బ్యాంకులు ఉన్నాయి. సరికొత్తగా తెచ్చిన హోండా ఎస్‌పీ 125ను రెండు వేరియంట్‌లలో తీసుకొస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వీటి ధర డ్రమ్ బ్రేక్ వెర్షన్ రూ. 75,010(ఎక్స్-షోరూమ్)తో లభిస్తుండగా, డిస్క్ బ్రేక్ వెర్షన్ రూ. 79,210తో లభిస్తోంది. ఈ బైక్ ఏబీఎస్‌తో పాటు సెగ్మెంట్ సైలెంట్-స్టార్ట్ ఏసీజీ స్టార్టర్ మోటర్ కూడా ఉనని, హోండా ఎస్‌పీ 125ను హోండా షైన్‌కు ప్రీమియం వెర్షన్‌గా కంపెనీ తీసుకొచ్చింది. కొద్దిరోజుల క్రితమే హోండా తన షైన్ మోడల్ బైక్ 90 లక్షల యూనిట్ల మార్కును చేరుకున్నట్టు ప్రకటించింది. 14 ఏళ్ల క్రితం మార్కెట్లోకి తెచ్చిన ఈ మోడల్ 125సీసీ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా రికార్డు సాధించడమే కాకుండా ప్రతి ఏటా 26 శాతం విక్రయాల వృద్ధిని సాధితున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed