పండుగ సీజన్.. హోండా అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్’

6

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ సందర్భంగా దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా కార్ల్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) తన సరికొత్త కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్’ కారును బుధవారం లాంచ్ చేసింది.

ఎమ్‌టీ, సీవీటీ వేరియంట్‌లలో పెట్రోల్, డీజిల్ విభాగాల్లో లభించే ఈ కారు రానున్న పండుగ సీజన్‌కు మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్‌లో సరికొత్త ఫీచర్లను అందిస్తున్నామని, వినియోగదారులకు మెరుగైన సదుపాయాలు ఆకర్షిస్తాయని కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేష్ గోయెల్ ఓ ప్రకటనలో తెలిపారు.

అమేజ్ ఎస్ గ్రేడ్ మోడల్ అత్యధికంగా అమ్ముడైన వాటిలో ఒకటని. ఎస్-గ్రేడ్ ఆధారంగా ప్రత్యేక ఎడిషన్‌లో స్మార్ట్ న్యూ ఫీచర్లను అందించడమే కాకుండా, వీటి ధరల శ్రేణి ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన వివరించారు. అద్భుతమైన ఫీచర్లకు కలిగిన హోండా అమేజ్ ‘స్పెషల్ ఎడిషన్’ పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 7 లక్షలుగా ఉండగా, డీజిల్ వెర్షన్ ధర రూ. 8.30 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది.