నైట్ కర్ఫ్యూ ఉండదు : హోం మంత్రి మహమూద్ అలీ

by  |
home minister mahmod ali
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో లో వీకెండ్స్‌తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారంలో రెండ్రోజుల పాటు నైట్ కర్ఫ్యూ లేక లాక్‌డౌన్ విధించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని, దీనిపై సీఎం కేసీఆర్ ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది. దీంతో హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రభుత్వానికి నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన లేదని తెలిపారు. సోమవారం ఓల్డ్ సిటీలోని మీర్‌చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు దేశమంతటా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాదులో నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డౌన్‌లు విధించే ప్రణాళిక లేవి ప్రభుత్వం చేపట్టలేదన్నారు.

లాక్‌డౌన్ ప్రజల జీవితాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి కర్ఫ్యూ విధించే ఉద్దేశం పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ఫ్యూ విధించడం ద్వారా నగరంలోని అనేక మంది జీవితాలు, వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసర సమావేశాలను నివారించాలని, మాస్క్‌లను ధరించాలని సూచించారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, మదర్సాలు పని చేయాలా వద్దా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేసుల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రజలు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన సూచించారు.


Next Story