- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల చేతిలో హోంగార్డు దారుణ హత్య
<p>దిశ, ఖమ్మం: విధుల్లో ఉన్న ఓ హోంగార్డును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలోని బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కుర్సం రమేష్ అనే హోంగార్డు ఏజెన్సీకి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాడని భావించిన మావోయిస్టులు.. రమేశ్‌పై కొంతకాలంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలో గురువారం అదును చూసి కిడ్నాప్ చేశారు. అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపారు. మృతదేహం పక్కనే “నేషనల్ […]</p>

దిశ, ఖమ్మం: విధుల్లో ఉన్న ఓ హోంగార్డును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలోని బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కుర్సం రమేష్ అనే హోంగార్డు ఏజెన్సీకి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాడని భావించిన మావోయిస్టులు.. రమేశ్‌పై కొంతకాలంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలో గురువారం అదును చూసి కిడ్నాప్ చేశారు. అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపారు. మృతదేహం పక్కనే “నేషనల్ పార్క్ ఏరియా కమిటీ” పేరుతో ఓ లేఖను వదిలి వెళ్లారు. 2006లో రమేష్ సల్వజుడుంలో పని చేసినప్పట్నుంచీ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నాడనీ, అందుకే హతమార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా, దీనిపై సమాచారమందుకున్న ఫర్సేగఢ్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
tag:home guard, murder, bijapur, chhattisgarh






