- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ వధువుకు షాక్ ఇచ్చిన హిజ్రాలు.. క్షణాల్లో మాయం
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే నిశ్చితార్థం జరిగిన యువతికి హిజ్రాలు షాక్ ఇచ్చారు. దీవిస్తామని చెప్పి వధువు వద్ద డబ్బులు మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై నరగ సమీపంలోని టి-నగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. స్థానిక సైదాపేటకు చెందిన సురేష్ అనే వ్యక్తి ఇటీవల తన కుమార్తెకు నిశ్చితార్థం చేశారు. ఈ నేపథ్యంలో వధువు ఆమె స్నేహితురాళ్ళతో కలిసి ఒక నిశ్చితార్థానికి వెళ్లే ముందు, టి.నగర్‌లో గోరింటాకు పెట్టుకునేందుకు కారులో వచ్చారు. కారును ఆపగానే […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే నిశ్చితార్థం జరిగిన యువతికి హిజ్రాలు షాక్ ఇచ్చారు. దీవిస్తామని చెప్పి వధువు వద్ద డబ్బులు మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై నరగ సమీపంలోని టి-నగర్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. స్థానిక సైదాపేటకు చెందిన సురేష్ అనే వ్యక్తి ఇటీవల తన కుమార్తెకు నిశ్చితార్థం చేశారు. ఈ నేపథ్యంలో వధువు ఆమె స్నేహితురాళ్ళతో కలిసి ఒక నిశ్చితార్థానికి వెళ్లే ముందు, టి.నగర్‌లో గోరింటాకు పెట్టుకునేందుకు కారులో వచ్చారు. కారును ఆపగానే ఐదుగురు హిజ్రాలు వధువు వద్దకు వచ్చి స్నేహితురాళ్ళ వద్ద ఉన్న రూ.12 వేలు మాయం చేశారు. ఆ తర్వాత ఇదే ముఠా వివాహానికి హాజరై, వధువును ఆశీర్వదిస్తామని చెప్పి, ఆమె వద్ద ఉన్న రూ.10 వేలను దోచుకుని క్షణాల్లో అక్కడ నుంచి మాయమయ్యారు. హిజ్రాలు డబ్బు మాయం చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న వధువు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






