మద్యం షాపుల్లో రిజర్వేషన్లు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

by  |
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కులం ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దుకాణాల కేటాయింపునకు టెండర్ పత్రాల దాఖలు ప్రక్రియ జరుగుతూ ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ విజ్ఞప్తి చేశారు. మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్టీలకు 5%, ఎస్సీలకు 10%, గౌడ కులస్తులకు 15% చొప్పున ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు బెంచ్, ఏ ప్రాతిపదికన మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను కేటాయించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలను సమర్పించాలని న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.



Next Story

Most Viewed