పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చండి: హైకోర్టు

by Vemula.Srinu Prasad |

<p>వైఎస్సార్సీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఝలకిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీని పోలి ఉండేలా వేసిన రంగుల పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ 2018 ఆగస్ట్‌ 11న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. పంచాయతీలకు వైఎస్సార్సీపీ పార్టీని గుర్తు తెచ్చేలా వేసిన రంగులను 10 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ భవనాలకు రంగులు వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను రెండు [&hellip;]</p>

పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చండి: హైకోర్టు
X

వైఎస్సార్సీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఝలకిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీని పోలి ఉండేలా వేసిన రంగుల పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. పంచాయతీ భవనాలకు రంగులు వేయాలంటూ 2018 ఆగస్ట్‌ 11న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. పంచాయతీలకు వైఎస్సార్సీపీ పార్టీని గుర్తు తెచ్చేలా వేసిన రంగులను 10 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ భవనాలకు రంగులు వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో వారే బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story