- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్ అండ్ సీక్ … అదరగొట్టిన యాంకర్ రవి కూతురు
<p>కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా లాక్ డౌన్ అయిపోయారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే… కరోనా మమ్మల్ని ఇంటికి పరిమితం చేయగలదేమో కానీ… మా టాలెంట్ ను మాత్రం నాలుగు గోడలకు పరిమితం చేయలేదని చెప్తూ… తమదైన రీతిలో అలరిస్తున్నారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే షార్ట్ ఫిల్మ్స్, షోస్ తో అలరిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి, తన కూతురు నియా, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాల షార్ట్ ఫిల్మ్ […]</p>

కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా లాక్ డౌన్ అయిపోయారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే… కరోనా మమ్మల్ని ఇంటికి పరిమితం చేయగలదేమో కానీ… మా టాలెంట్ ను మాత్రం నాలుగు గోడలకు పరిమితం చేయలేదని చెప్తూ… తమదైన రీతిలో అలరిస్తున్నారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే షార్ట్ ఫిల్మ్స్, షోస్ తో అలరిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి, తన కూతురు నియా, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాల షార్ట్ ఫిల్మ్ హైడ్ అండ్ సీక్ ఆకట్టుకుంది. బేబీ నియా క్యూట్ గా కనిపిస్తూనే యాక్టింగ్ అదరగొట్టగా… పాప నటన ముందు ఈ సెలబ్రిటీలు అంతా చిన్నబోయారు. అంత బాగా చేసింది చిన్నారి నియా.
హైడ్ అండ్ సీక్ స్టోరీ:
లాక్ డౌన్ సమయంలో భార్యను ఎలా మెప్పించాలి అని గూగుల్ లో సర్చ్ చేస్తుంటాడు రవి. అదే టైంలో నియా.. డాడీ హైడ్ అండ్ సీక్ ఆడుదామని రవిని అడుగుతుంది. దీంతో నియా కళ్లు మూసుకోగా… రవి వెళ్లి ఓ రూమ్ లో దాక్కుంటాడు. అందులో అనసూయ ఉంటుంది. ఏంట్రా నా రూం కు వచ్చావ్ అని అడిగితే… నియాతో గేమ్ ఆడుతున్న… తను వస్తే చెప్పొద్దూ అంటాడు. ఇంతలో బేబీ నియా వచ్చి డాడీ ఎక్కడా అని అడుగుతుంది. నాకు తెలియదు అని అనసూయ చెప్పగా… ఐతే నువ్వే ఔట్ అని అంటుంది. దీంతో అనసూయ ఔట్ కాగా… తను వెళ్లి రాహుల్ గదిలో దాక్కుంటుంది. ఇలా రాహుల్, అలీ రెజా ఒకరి తర్వాత ఒకరు గేమ్ లోకి ఎంటర్ అవుతారు. చివరలో అలీ రేజా కళ్లు మూసుకోగా… బేబీ నియా దాక్కుంటుంది. కానీ ఎంతకు దొరకదు. దీంతో అందరూ కలిసి వెతకడం మొదలు పెడతారు. పాప పార్లర్ వెళ్లిందేమో చూసొస్తా అని అనసూయ అంటే… జిమ్ వెళ్లిందేమో చూసోస్తా అంటాడు అలీ. పక్కింట్లో తన ఫ్రెండ్ తో అడుతుందేమో నేను చూసొస్తా అంటాడు రాహుల్. చివరగా వెతకగా రవికి పాప డ్రాయింగ్ వేస్తూ కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇళ్లంతా వెతికాము.. ఎక్కడికి వెళ్లావో అని భయపడి పోయాము అంటాడు. లాక్ డౌన్ ఉండగా నేను బయటకి ఎందుకు వెళతాను… సిల్లీ రీజన్స్ చెప్పి… ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ట్రై చేయొద్దూ. # Stay Home # Stay Safe… అని చివరగా సందేశం చెప్తుంది నియా.
Tags : Anchor Ravi, Baby Viya, Anasuya Bharadwaj, Rahul Sipligunj, Ali Reza






