ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ మెయిన్ గేట్ వద్దకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు.. ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము గెలిచినా తమ నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని, ఇంకా పాత కార్పొరేటర్లే అధికారం చెలాయిస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. [&hellip;]</p>

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ మెయిన్ గేట్ వద్దకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు.. ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము గెలిచినా తమ నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని, ఇంకా పాత కార్పొరేటర్లే అధికారం చెలాయిస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Next Story