హీరోయిన్స్ పెట్ డైరీస్

by  |
హీరోయిన్స్ పెట్ డైరీస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ వస్తున్నాయి. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడగా.. స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో కొందరు వంటలో ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు బుక్స్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంకొందరు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరేమో ఫిట్ నెస్‌పై కాన్సంట్రేట్ చేశారు. కొంతమంది పెట్ లవర్స్ అయిన హీరోయిన్లు తమకు ఇష్టమైన పెంపుడు జంతువులతో కాలం గడుపుతున్నారు.

https://www.instagram.com/p/CAQeLX4A3iw/?utm_source=ig_web_copy_link

మీరే ప్రపంచం

క్యూట్ హీరోయిన్ రష్మిక మందన తన పెట్ డాగ్‌ను చక్కగా చూసుకుంటుంది. తనతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంచేందుకు ట్రై చేస్తోంది. మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే.. వాటిని హృదయపూర్వకంగా ఆదరిస్తూ.. సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి అంటోంది. ఎందుకంటే వాటికి మీరే ప్రపంచం అని చెప్తోంది.

https://www.instagram.com/p/CATGmEPhw1z/?utm_source=ig_web_copy_link

థాంక్యూ క్లారా

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్‌కు లాక్‌డౌన్‌లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకటి మ్యూజిక్ కాగా మరొకటి తన పెట్ క్లారా. ఈ క్రేజీ క్యాట్ లేడీ.. ఈ టైమ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తోంది. థాంక్స్ క్లారా నాకు ఇంతమంచి సమయాన్ని ఇచ్చినందుకు అంటూ తనతో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది శృతి. కాగా లాక్‌డౌన్‌లో శృతి క్లారాల కాంబినేషన్ ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి కూడా.

https://www.instagram.com/p/CASEAWRpuMa/?utm_source=ig_web_copy_link

నైక్‌తో సండే కన్వర్జేషన్స్

మహానటి కీర్తి సురేష్‌కు తన కుక్కపిల్ల నైక్ అంటే ప్రాణం. నైక్‌తో గుడ్ మార్నింగ్, నైక్‌తో గుడ్ ఈవెనింగ్, నైక్‌తో గుడ్ నైట్ అంటూ చెప్పే కీర్తి.. తనతో ఉన్న ప్రతీ మూమెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఇష్టపడుతుంది. కాగా లాక్‌డౌన్‌లో నైక్‌కు తనకు మధ్య సండే కన్వర్జేషన్స్ ఇలా ఉన్నాయని చెప్తోంది. నైక్‌కు హ్యాపీ సండే చెప్పేందుకు వెళ్తే… అన్ని రోజులు సండే లాగే ఉన్నాయి అనడంతో ఆశ్చర్యపోవడం తన వంతు అయింది అన్నట్లుగా ఓ పోస్ట్ పెట్టింది కీర్తి.

https://www.instagram.com/p/B__uCw_BMK_/?utm_source=ig_web_copy_link

టంటుతో హ్యాపీ

స్టార్ హీరోయిన్ సమంత పెట్ గురించి అందరికీ తెలిసిందే. తన పుట్టిన రోజున విష్ చేసేందుకు కొత్తగా ట్రై చేసిన దర్శకురాలు నందిని రెడ్డి, తేజ్‌లు.. పెట్ సైడ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. కాగా సామ్ టంటును అడాప్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్తోంది. తనతో ఆడుకోవడం, తనను తీసుకుని షికారుకు వెళ్ళడం, తనకి స్నానం చేయించడం ప్రతీ విషయం తనకు చాలా ఇష్టమని చెప్తోంది సామ్.

Next Story

Most Viewed